Sri
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి !
కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హ్దంత రాళంగర్జిస్తూపదండి పోదాం, వినబడలేదామరో ప్రపంచపుజలపాతం?
దారి పొడుగునా గుండె నెత్తురులుతర్పణచేస్తూ పదండి ముందుకు!బాటలు నడచీ, పేటలు కడచీ, కోటలన్నిటిని దాటండి!నదీనదాలూ, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంఖి? పదండీముందుకు, పదండి త్రోసుకు!పోదాం, పోదాం పైపైకి!
ఎముకలు క్రుళ్ళినవయస్సు మళ్ళినసోమరులార! చావండి!నెత్తురుమండే,శక్తులు నిండేసైనికులారా! రారండి!”హఓం! హరోం హర!హర!హర!హర!హర!హరోం హరా!” అని కదలండి!మరోప్రపంచం, మహా ప్రపంచంధరిత్రి నిండా నిండింది!పదండిముందుకు,పదండి త్రోసుకు!ప్రభంజనంవలె హోరెత్తండీ!భావ వేగమున ప్రసరించండీ!వర్శుకభ్రములప్రళయఘోశవలెపెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండీ,పదండి,పదండీ ముందుకు,కనబడలేదా మరోప్రపంచపుకణకణమండే త్రేతాగ్ని?
ఎగిరి,ఎగిరి,ఎగిరి పడుతున్నవిఎనభై లక్శల మేరువులుతిరిగి,తిరిగి, తిరిగి సముద్రాజలప్రళయ నాట్యం చేస్తున్నవి!సలసలక్రాగే చమురా?కాదిది,ఉశ్ణరక్త కాసారం!శివసముద్రమా, నయాగరావలెఉరకండీ, ఉరకండీముండుకుపదండి ముందుకు, పదండి త్రోసుకు!మరో ప్రపంచపుకంచు నగారావిరామ మెరుగక మ్రోగింది!
త్రాచులవలెనూ, రేచులవలెనూ,ధనంజయునిలా సాగండి!కనబడ లేదా మరో ప్రపంచపుఅగ్ని కిరీటపుధగధగలు, ఎర్రబావుటా నిగనిగలు,హోమజ్వాలలభుగభుగలు?
2 Responses
  1. srirangam srinivasa raoo
    bhabaprakatanaku nuvvu badushavu
    nee kavithaku vela kattaledu a navabu
    nee pi vimarsalaku idi na javabu


  2. srirangam srinivasa raoo
    bhavaprakatanaku nuvvu badushavu
    nee kavithaku vela kattaledu a navabu
    nee pi vimarsalaku idi na javabu